శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ధర్మకర్తలు, అధికారులు, అర్చకుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంగమాంబ, గురవయ్య స్వాములను ప్రత్యేకంగా అలంకరించారు. హోమాలు, పూజలు జరిపారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశం కల్పించలేదు.
నిరాడంబరంగా వెంగమాంబ బ్రహ్మోత్సవాలు - నర్రవాడలో వెంగమాంబ బ్రహ్మోత్సవాల వార్తలు
నెల్లూరు జిల్లా నర్రవాడలోని శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. 5 రోజులపాటు జరిగే ఈ వేడుకలను ఆలయ అధికారులు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశం కల్పించలేదు.
నిరాడంబరంగా ప్రారంభమైన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు