ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం - వెంగమాంబ ఆలయ బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి జరపనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రవేశం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.

vengamamba brahmotsavalu will be started from june 7th in nellore district
వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

By

Published : Jun 7, 2020, 12:38 PM IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కరుణాకర్ బాబు, ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే వారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ప్రవేశం లేకుండా ఏకాంత పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు జరుపనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ తేదీన అమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details