తిరుపతిలో ఎనిమిది చోట్ల కూరగాయల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా... రెండు చోట్ల మాత్రమే లభిస్తుండటంతో రద్దీ ఎక్కువైంది. కొన్నిచోట్ల కనీస జాగ్రత్తలు పాటించకుండా జనం ఎగబడ్డారు. ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నగరంలో తిరుగుతూ ప్రజలను గుమికూడవద్దంటూ వారించారు. నెల్లూరులో 48ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 27రైతు బజార్లు ద్వారా కూరగాయలు విక్రయిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ - మార్కెట్లకు బారులు తీరిన ప్రజలు - రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్
కరోనా నివారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు అనుమతించడంతో... రహదారులు, మార్కెట్ల వద్ద ప్రజల సంచారం అధికమైంది.

vegitables-market-rush-in-ap
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్-మార్కెట్లో ప్రజలు
అనంతపురంలోని పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాజమహేంద్రవరంలో రైతుబజార్లకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కొన్ని చోట్ల ప్రజలు గుమికూడి కొనుగోళ్లు చేశారు. మరికొన్ని చోట్ల వరుసల్లో నిలబడి... సామాజిక దూరం పాటిస్తూ క్రయవిక్రయాలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని వ్యవసాయమార్కెట్‌లో జనం... జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోళ్లు చేశారు.