నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం రెడ్ జోన్ ప్రాంతంలోని ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ.. కరోనానేపథ్యలో రెడ్ జోన్ ప్రాంత ప్రజలు బయటకి వెళ్లే పరిస్థితి లేదని.. ఇలాంటి స్థితిలో ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యులు ,పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవకు పాదాభివందనం చేస్తున్నామన్నారు.
రెడ్ జోన్ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ - గూడూరులో కూరగాయలు పంచిన ఎమ్మెల్యే వరప్రసాద్
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం అభినందనీయమని.. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేశారు.
![రెడ్ జోన్ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ vegetables distributed by mla vara prasad at red zone areas of guduru in nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7003717-250-7003717-1588250607027.jpg)
గూడూరులో కూరగాయలు పంపిణీ