ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Complaint To NHRC: 'మట్టి మాఫియాను ప్రశ్నిస్తే దాడులా ?' - వర్ల రామయ్య తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలో మట్టిమాఫియాను అడ్డుకున్న ఎస్సీ యువకుడిపై దాడి ఘటనపై తెదేపా నేత వర్ల రామయ్య(varla ramaiah) ఎన్​హెచ్​ఆర్సీలో (NHRC) ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్​పై కేసులు ఎత్తివేయటంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్​ను కోరారు.

varla ramaiah Complaint to NHRC over nellore sc young man attack issue
మట్టి మాఫియాను ప్రశ్నిస్తే దాడులా ?

By

Published : Jun 21, 2021, 4:27 PM IST

నెల్లూరు జిల్లాలో మట్టిమాఫియాను అడ్డుకున్న ఎస్సీ యువకుడు మల్లికార్జున్​పై వైకాపా నేతలు దాడి చేయటంతో పాటు పోలీసులు బాధితునిపై కేసు నమోదు చేయటంపై తెదేపా నేత వర్ల రామయ్య(varla ramaiah) మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్​కు (NHRC) ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్​పై అక్రమ కేసులు ఎత్తివేయటంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్​ను కోరారు. జూన్ 16న ద్విచక్రవాహనంపై వెళ్తున్న మల్లికార్జున్​ను అడ్డగించి వైకాపా నేతలు దాడి చేశారన్నారు. అదే రోజు రాత్రి బాధితుడిపై కొడవలూరు పోలీస్టేషన్​లో తప్పుడు కేసు పెట్టించారన్నారు. రాష్ట్రానికి తక్షణమే ఓ ప్రత్యేక బృందాన్ని పంపి మల్లికార్జున్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్​హెచ్​ఆర్సీని (NHRC) విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదు కాపీ

రాష్ట్రంలో ఎస్సీల ప్రాథమిక హక్కులు హరించేలా తరచూ వివిధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. గత రెండేళ్లలో ఎస్సీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఫలితమూ లేదన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే చర్యలు రాష్ట్రంలో సర్వసాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటవిక పాలనను తలిపించే ఈ చర్యలను నివారించాల్సిన బాధ్యత మానవ హక్కుల కమిషన్​పై ఉందని పేర్కొన్నారు. శాసనమండలిలో మెజారిటీ తక్కువ ఉన్నప్పుడు మండలి రద్దు తీర్మానం చేసి ఇప్పుడు బలం పెరిగాక స్వాగతించటం సీఎం జగన్ (cm jagan) అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎస్సీలు తన బంధువులన్న జగన్‌..వారిపై దాడులు చేస్తే మాత్రం స్పందించటం లేదని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details