పోలీసుల ఆధ్వర్యంలో 'వనం-మనం' - trees
ఆత్మకూరులో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో డీఎస్పీ వెంకటాద్రి మొక్కలు నాటారు.
పోలీసుల ఆధ్వర్యంలో 'వనం-మనం'
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలలో వనం-మనం కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు నిర్వహించారు. డీఎస్పీ వెంకటాద్రి పాల్గొని పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు.