జిల్లాలోని ప్రతిఒక్కరూ 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మొక్కలు నాటారు. జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ మొక్కలు నాటాలన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందివ్వాలంటే చెట్లను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
'భావితరాల కోసం మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టండి' - నెల్లూరులో వన మహోత్సవం
భావితరాల కోసం మొక్కల పెంపకాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా నెల్లూరు పట్టణ పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
నెల్లూరు పోలీస్ స్టేషన్లో వన మహోత్సవం