Urea Not Available: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఎకరాకు ఆరు బస్తాలు అవసరమైతే అరబస్తా కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానా అగచాట్లు వరి నార్లు వేస్తే సమయానికి యూరియా అందుబాటులోకి రావటం లేదని వచ్చిన అరకొర యూరియా సరిపోవటం లేదని.. గ్రామంలోని సొసైటీ భవనం వద్ద తమకు సరిపడా ఎరువులు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. సమయం అయిపోయిన తరువాత వేసి ప్రయోజనం ఉండదని అటు పొలం పనులు చేసుకోలేక యూరియా కోసం పడికాపులు కాయలేక నాన అవస్థలు పడాల్సివస్తుందని రైతులు ఆవెేదన చెందుతున్నారు. మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం ఉదయం నుండి ఎండలో రైతులు బారులు తీరి సాయంత్రం వరకు లైన్లో ఉన్నా ఒక్క యూరియా బస్తా కూాడా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు రెండు బస్తాలు మూడు బస్తాలు ఇస్తున్నారు. ఎక్కువ జనాలు వస్తున్న కారణంగా తక్కువ సరకొస్తుంది.. మేము అందరికీ అందించలేం.. ఒకరికి రెండు బస్తాలు, మూడు బస్తాలు ఇవ్వగలమని చేతులెత్తేస్తున్నారు. యూరియా ఎంతొస్తుందో, ఎంత పోతుందో మాకు తెలియదు. అధికారులైతే మరీ దారుణం చేస్తున్నారు. దీనివల్ల రైతులు భయంకరంగా బాధపడుతున్నారు.- రైతు