యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్... అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు అటవీ ప్రాంతంలో.. యురేనియం తవ్వకాల ప్రదేశాన్ని రామకృష్ణ బృందం పరిశీలించింది. బృందంలోని సభ్యులు గ్రామ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. యురేనియం తవ్వకాల వల్ల నీరు కలుషితమై పంటలు పండని పరిస్థితి తలెత్తిందని, తమ జీవితాలు ప్రమాదంలో పడ్డాయని.. గ్రామస్థులు రామకృష్ణ బృందానికి తెలిపారు. వెంటనే తీర్మానం చేయని పక్షంలో.. అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు
"యూరేనియం తవ్వకాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి" - యూరేనియం తవ్వకాలను పరిశీలన
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు అటవీ ప్రాంతంలో.. యురేనియం తవ్వకాల ప్రదేశాన్ని రామకృష్ణ బృందం పరిశీలించింది.
!["యూరేనియం తవ్వకాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4792645-831-4792645-1571399840092.jpg)
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
TAGGED:
యూరేనియం తవ్వకాలను పరిశీలన