ఉదయగిరికి చెందిన భూస్రా అనే బాలిక ఎప్పటిలాగే ఉదయాన్నే పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. ఆడుతూ పాడుతూ స్కూల్కు ఆనందంగా వెళ్తున్న ఆ బాలికను కొందరు అనుసరించారు. సమయం చూసి పాపను అపహరించేందుకు ప్రయత్నించారు. ఇదంతా గమనిస్తూ... అప్రమత్తమైన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను దుండగుల నుంచి కాపాడారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ ఉదయం జరిగింది.
girl kidnap: బాలిక అపహరణకు విఫల యత్నం - నెల్లూరు జిల్లా వార్తలు
పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికను అపహరించేందుకు యత్నించారు కొందరు. అప్రమత్తమైన స్థానికులు.. ఆ నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది.

బాలిక అపహరణకు విఫల యత్నం