Central Minister Kishan Reddy Comments : అమ్మభాషను ప్రోత్సహించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ 2023లోపు పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నారని తెలిపారు. మునుగోడులో తెరాస అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో అనుసంధానకర్తలుగా పాత్రికేయులు ఉండాలని సూచించారు. పాత్రికేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు ఎవరి స్థాయిలో వారు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని కోరారు.
అమ్మభాషను మోదీ ప్రోత్సహిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - కిషన్ రెడ్డి పాత్రికేయుల అవగాహన సదస్సు
Central Minister Kishan Reddy: నెల్లూరు జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గోన్నారు. అమ్మభాషను ప్రోత్సహించే ప్రయత్నం మోదీ చేస్తున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తెరాస అక్రమాలకు పాల్పడిందని అరోపించారు.
Etv Bharat
స్వర్ణాల చెరువు గణేశ్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్తిక దీపోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వేమిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దీపా వెంకట్లు పాల్గొన్నారు. మత్స్యకార పడవల శివలింగాకృతి ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే బాణసంచాతో నిమజ్జన ఘాట్ స్వర్ణశోభితంగా మారింది.
ఇవీ చదవండి: