నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ బస్టాండ్ ఆవరణలో దివంగత నేత ప్రధాని రాజీవ్ గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను పక్కపక్కనే ఏర్పాటు చేసి ఉన్నారు. గత రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ కుడిచేతిని విరగ్గొట్టి పక్కన పడేశారు. ఉదయం గమనించిన స్థానికులు, వైకాపాశ్రేణులు, కార్యకర్తలు అభిమానులు విగ్రహం వద్దకు చేరుకొన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చి... ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మకూరులో వైఎస్ఆర్ విగ్రహం కుడి చేయి ధ్వంసం - latest news news in nellore
ఆత్మకూరు మున్సిపాలిటీ బస్టాండ్ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహం కుడి చేతిని గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు.
ఆత్మకూరులో వైఎస్ఆర్ విగ్రహం కుడి చేతిని విరగ్కొట్టిన దుండగలు