నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని ఓడిఎఫ్ ప్లస్ పంచాయతైన నర్రవాడలో యునిసెఫ్ ప్రతినిధి సుభాష్ చంద్ర బెహరా పర్యటించారు. పంచాయతీ అభివృద్ధికి పాలకులు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పంచాయతీకి ఆదాయం వచ్చే వనరుల గురించి వివరాలు సేకరించారు. నర్రవాడలో ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలో బహిరంగ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం మార్గాలను అన్వేషించారు. అనంతరం నర్రవాడ ఎస్సీ కాలనీ మహిళలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల ప్రజలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెడితే ఎంతగానో అభివృద్ధి చెందుతాయన్నారు.
నర్రవాడలో యునిసెఫ్ ప్రతినిధి పర్యటన - Narrawada news
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో నర్రవాడలో యునిసెఫ్ ప్రతినిధి సుభాష్ చంద్ర బెహరా పర్యటించారు. గ్రామాలలో ప్రజలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

నర్రవాడలో యునిసెఫ్ ప్రతినిధి పర్యటన