ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉదయగిరిలో సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే చంద్రశేఖర్​రెడ్డి అన్నారు.

Udayagiri MLA mekapati chandrashekharredsy started  zero interest scheme
ఉదయగిరిలో సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి

By

Published : Apr 24, 2020, 8:07 PM IST

పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సున్నా వడ్డీ పథకం మంజూరు పత్రాలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఉన్న 4,724 పొదుపు బృందాలకు ప్రభుత్వం రూ.9.89 కోట్ల రుణాలను మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్​.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే విధంగా పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ బీమా పథకంలో భాగంగా 17 మందికి మంజూరైన రూ.30 లక్షల చెక్కులను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details