నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉదయగిరిలోని స్త్రీ శక్తి భవనంలో ఉదయగిరి, వింజమూరు సబ్ డివిజన్ల వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.
'రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం' - udayagiri latest news
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. నివర్ తుపానుతో దెబ్బతిన్న పంట నష్టంపై ఆరా తీశారు. బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉదయగిరిఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో... తుపాను వల్ల 14,917.2 హెక్టార్లలో మినుము, కంది, పెసర, వరి, పొగాకు, పసుపు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పంటనష్టంపై నివేదికలు సిద్ధం చేసి... ప్రభుత్వానికి పంపి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీచదవండి.