నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణానికి చెందిన మహిళలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో స్థానిక అధికారులు నిబంధనలు పక్కనపెట్టి... ఇల్లు ఉన్నవారికి స్థలాలను మంజూరు చేస్తున్నారని వాపోయారు. గ్రామ వాలంటీర్లు సైతం వారికి సంబంధించిన వాళ్లకే నివేశన స్థలాల పంపిణీ జాబితాలో చోటు కల్పిస్తున్నారని తెలిపారు.
వాలంటీర్లను నిలదీస్తే... కేసులు పెడతామని తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ కాలనీల్లో నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని... అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే కాలయాపన చేస్తున్నారని బాధపడ్డారు. నివేశన స్థలాల పంపిణీలో అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ డీటీ ఫాజిహాకు వినతిపత్రం అందజేశారు.