నెల్లూరులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. నవలాకులతోటకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి అనుమానంతో తన భార్య నిర్మలమ్మతో పాటు మరో మహిళ రమణమ్మను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు స్టేషన్లో లొంగిపోయాడు. తరచూ వీరి కాపురంలో గొడవలు జరుగుతుండేవని బంధువులు తెలిపారు. మృతదేహాలను మార్చూరీకి తరలించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరులో జంట హత్యలు..పీఎస్లో లొంగిపోయిన నిందితుడు - నెల్లూరు తాజా వార్తలు
నెల్లూరులో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరో మహిళను హత్య చేశాడు.
![నెల్లూరులో జంట హత్యలు..పీఎస్లో లొంగిపోయిన నిందితుడు నెల్లూరులో ఇద్దరు మహిళల దారుణ హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9132673-669-9132673-1602395190205.jpg)
నెల్లూరులో ఇద్దరు మహిళల దారుణ హత్య