జిల్లాలో తొమ్మిది ట్రయోజెనిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: జేసీ
నెల్లూరు జిల్లాలో తొమ్మిది ట్రయోజెనిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసి ప్రభాకర్ తెలిపారు. మెుదటి విడతగా రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.
జిల్లాలో తొమ్మిది ట్రయోజెనిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
నెల్లూరు జిల్లాలో తొమ్మిది చోట్ల ట్రయోజెనిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసి ప్రభాకర్ తెలిపారు. మెుదటి విడతగా హరిత టూరిజం, ఆత్మకూరులో ట్రయోజెనిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పాజిటివ్ వ్యక్తులను మెుదటగా ఈ కేంద్రాలకు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహిస్తామని..ఒకేసారి ఐదు వేల మందికి వైద్యం అందించేందుకు కొవిడ్ కేర్ సెంటర్లలో వసతులు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.