ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు దొంగలు అరెస్టు.. 11 తులాల బంగారం స్వాధీనం - నెల్లూరులో ఇద్దరు దొంగల అరెస్టు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.17 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

two thief arrested in nelore district
ఇద్దురు దొంగల అరెస్టు

By

Published : Oct 21, 2020, 10:05 PM IST

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇద్దరు దొంగలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు పాత నేరస్తుడు కాగా, మరొకరు బాల నేరస్తుడిని పోలీసులు వెల్లడించారు. కోవూరు మండలం ఇనమడుగు ప్రాంతంలో జరుగుతున్న దొంగతనాలపై నిఘా ఉంచిన పోలీసులు.. జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన సునీల్ అనే దొంగ తోపాటు, ఓ బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు.

వీరి నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే 11 తులాల బంగారు ఆభరణాలు, 17 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సునీల్ పాత నేరస్తుడని, అతనిపై ఇప్పటికే 20 కి పైగా కేసులు ఉన్నాయని రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details