నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులు తిరిగి రాకపోవడంతో... ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కంపసముద్రంలోని హైస్కూల్లో విచారణ జరిపారు. అదృశ్యమైన విద్యార్థులు కోసం ఆరాతీశారు. మధ్యాహ్నం విరామం తర్వాత ఇద్దరు విద్యార్థులు కనిపించలేదని విచారణలో తేలినట్టు ఎస్సై శివరాకేష్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఎక్కడికెళ్లినా తిరిగివస్తారనే నమ్మకంతో ఉన్నారు.
ఎక్కడున్నారో... ఎలా ఉన్నారో..? - nellore latest news for two boys missing
పిల్లలు కనిపించకపోతే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. కనిపించేంత వరకు భయంభయంగా గడుపుతారు. ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తుంటారు. నెల్లూరు జిల్లా కంపసముద్రంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రుల శోకం కూడా అలాంటిదే. పిల్లలను వెతికి తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు.
![ఎక్కడున్నారో... ఎలా ఉన్నారో..? two students missing in kampasamudhram high school at nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5288607-921-5288607-1575626488975.jpg)
నెల్లూరు జల్ల కంపసముద్రంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం