ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ఇద్దరు దొంగలు అరెస్ట్..రూ.6 లక్షలు, 10 వాహనా​లు స్వాధీనం - Two robbers arrested in Nellore - Rs 6 lakh,10 motorcycles seized

నెల్లూరులో ఇద్దరు దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 10 మోటార్ సైకిళ్లు, ఆరు లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Two robbers arrested in Nellore - Rs 6 lakh,10 motorcycles seized
నెల్లూరులో ఇద్దరు దొంగలు అరెస్ట్-ఆరు లక్షలు,10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం

By

Published : Jul 15, 2020, 7:25 PM IST

నెల్లూరులో ఇద్దరు దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కొడవలూరు మండలం యల్లాయపాలెంకు చెందిన శ్రీకుమార్, ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంకు చెందిన సందీప్ అనే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకుమార్ గత కొంత కాలంగా నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్నట్లు సీఐ బాజీ జాన్ సైదా తెలిపారు. అతని వద్ద నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంకు చెందిన సందీప్ అనే మరో దొంగను అరెస్టు చేసిన పోలీసులు, మైపాడు బీచ్ వద్ద చోరీ చేసిన ఓ బంగారు చైను, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఆరు లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.

ఇవీ చదవండి:'ధైర్యం చెప్పాల్సిన సీఎం... సమీక్షలతో కాలం వెల్లదీస్తున్నారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details