నెల్లూరు పాలెం సమీపంలోని నెల్లూరు - ముంబయి జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకవైపు ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను ఆత్మకూరు మండలం పడకండ్లకు చెందిన పోస్టల్ ఉద్యోగి వెంకటేశ్వర్లు, బోయళ్ల చిరువెళ్ల గ్రామానికి చెందిన అంకె కిష్టయ్యగా గుర్తించారు. అంకె కిష్ణయ్య నెల్లూరు పాలెం సమీపంలోని హైవే రెస్ట్ ఏరియాలో వాచ్మెన్గా పనిచేసేవారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.