నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనపై తడ మండలంలోని నిప్పో కంపెనీకి వెళ్తున్నారు.
ఈ క్రమంలో నాదేండ్లవారి కండ్రిగ వద్ద వాళ్ల బైకును టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.