ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident: ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు - బుధవాడ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కూలి పనులకు వెళ్లి వస్తున్న వాళ్లపైకి మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా బుధవాడ వద్ద జరిగింది.

a car hit auto at Nellore
ఆటోను ఢీకొట్టిన కారు

By

Published : Jun 12, 2021, 12:37 AM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బుధవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు కడప జిల్లా గోపవరం మండలం బెడుసుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నందిపాడు గ్రామంలో కూలి పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామమైన బెడుసుపల్లి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details