నెల్లూరు జిల్లాలో ఎండలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. వడగాల్పులు వీస్తున్న కారణంగా.. పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అనంతారం మండలం అగ్రహారం గ్రామంలో.. చెందిన మిర్చి పంటకు కాపలాగా ఉన్న నరేశ్ (15) వడదెబ్బతో మృతి చెందాడు. 11 గంటలైనా ఇంటి రాకపోవటంతో కుటుంబసభ్యులు పొలం వెళ్లి చూడగా విగత జీవిగా పడివున్నాడు. వడదెబ్బతోనే చనిపోయినట్టు డాక్టరు నిర్ధరించారు.
మర్రిపాడు మండలం రాంపల్లి లో లక్ష్మయ్య అనే వృద్ధుడు పొలం పనులకు వెళ్లి వడ దెబ్బ తగిలి స్పృహ కోల్పోగా... ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో చనిపోయాడు. రెండు రోజులుగా భానుడి ప్రతాపం 50 డిగ్రీలకు చేరుకున్న పరిస్థితుల్లో.. ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రెండు రోజులు ఇదే తరహా ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.