చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి - two people died news in Palacchuru
చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా పాలచ్చూరు గ్రామంలో జరిగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీయగా... ఇంకో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాలచ్చూరులో విషాదం జరిగింది. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వెంకటగిరి సమీపంలో సిద్ధవరంకు చెందిన ప్రసాద్, స్థానికుడు చంద్రయ్యలు కలిసి చేపలు కోసం చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఒకరి మృతదేహం బయటకు తీయగా... ఇంకో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.