ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం, గుట్కా దందాలపై.. పోలీసుల ఉక్కుపాదం - చిల్లకూరు తాజావార్తలు

నెల్లూరు, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో.. మద్యం, గుట్కా, గంజాయి వంటి నిషేధిత వస్తువులు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు చేసేవాళ్లతో.. కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

prohibited items
పోలీసుల అదుపులో నిందితులు

By

Published : Jun 10, 2021, 7:57 AM IST

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద స్కూటీపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 23 కేజీల గంజాయి, రెండు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2 లక్షల 30 వేలు ఉంటుందని వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుట్కా, గంజాయి, పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని గూడూరు రూరల్​ సీఐ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. విజయ్ కుమార్ శ్యాంప్రసాద్, గణేశ్​ బాలాజీ అనే వీరిద్దరూ చెన్నైకి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. గూడూరులో గంజాయి కొనుగోలు చేసి.. చెన్నైకి తరలిస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. వారిపై కేసు నమోదు చేసి.. రిమాండ్​కు తరలిస్తామని సీఐ తెలిపారు. స్పెషల్ డ్రైవ్​లో చిల్లకూరు ఎస్సై సుధాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో...

తాటికొండ మండలం మోతడక గ్రామంలో తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 69 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తెనాలిలో గుట్కా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. మార్కెట్ సెంటర్, చినరావూరు ప్రాంతాల్లోని గోడౌన్​లలో నిల్వచేసి ఉన్న 16,500 నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వినుకొండలోని చెక్​పోస్ట్ సెంటర్, అంబికా నగర్​లో గుట్కా అక్రమ నిల్వలున్నాయనే సమాచారం మేరకు పట్టణ సీఐ రమేశ్​ బాబు, ఎస్సై సింగయ్యలు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 226 బ్యాగుల గుట్కా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందన్నారు. గుట్కా నిల్వ చేసిన వ్యక్తి పరుచూరి చిన్న కాశీ విశ్వనాథ్​పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ చెప్పారు. అతని దగ్గర ఆరు రకాల నిషేధిత గుట్కా రకాలు ఉన్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిషేధిత వస్తువుల విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అక్రమంగా మద్యం తరలింపు.. 12 మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details