నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆత్మకూరు ఆర్‌వో చిన్నరాముడు, ఏఆర్‌వో విద్యాసాగరుడుపై సస్పెన్షన్ వేటుపడింది. చిన్నరాముడు ప్రస్తుతం ప్రస్తుతం ఆర్డీవోగా, విద్యాసాగరుడు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలింగ్ ముగిశాక వీవీ ప్యాట్ స్లిప్పులు కలకలం సృష్టించాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆ స్లిప్పులు బయటికి వచ్చాయని విచారణలో నిర్ధరణ అయ్యింది. సీఈసీ ఆదేశాలతో అధికారులను సస్పెండ్ చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్ - ap elections
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. సీఈసీ ఆదేశాలతో అధికారులను సస్పెండ్ చేస్తూ... రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్
Last Updated : May 31, 2019, 2:29 PM IST