నెల్లూరు జిల్లాలో దొంగలు హల్చల్.. కత్తులతో బెదిరించి.. - nellore attack news
12:21 September 14
లారీ డ్రైవర్‌పై కత్తులతో ఇద్దరు వ్యక్తుల దాడి
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు సమీపంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నిన్నరాత్రి కృష్ణపట్నం నుంచి జొన్నవాడ వైపు వెళ్తున్న లారీని ఇద్దరు దొంగలు ఆపారు. డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి, దాడి చేసి అతని వద్ద ఉన్న 15 వేల రూపాయల నగదును లాక్కుపోయారు. లారీ డ్రైవర్ 100 కు ఫోన్ చేసి సమాచారం చెప్పడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న బుచ్చిరెడ్డి పాలెం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదీవండి:మేడికొండూరు సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం