ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ... ఇద్దరికీ తీవ్ర గాయాలు - యాక్సిడెంట్ వార్తలు

Two Lorrys Accident: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతినగా క్యాబిన్​లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 20, 2022, 2:07 PM IST

Two Lorrys Accident: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు వేగంగా ఢీ కొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బుచ్చి నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీ, నెల్లూరు నుంచి బుచ్చి వైపు వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతినగా క్యాబిన్​లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి క్రేన్ సహాయంతో డ్రైవర్​ను బయటకు తీశారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మంచుకు తోడు, పోతిరెడ్డిపాలెం గ్రామం వద్ద 50 మీటర్ల మేరకు రోడ్డు సక్రమంగా లేకపోవడంతో అక్కడ డైవర్షన్ ఏర్పాటు చేయగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details