నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మానుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పెనుబల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది. కిందపడ్డ వీరిపై ..లారీ దూసుకెళ్లటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాల్మానుపురం వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - నెల్లూరు జిల్లా సాల్మానుపురం వద్ద రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మానుపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా సాల్మానుపురంరోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి