నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి. అయ్యవారిపల్లి గ్రామంలో సింగరబోయిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఎక్కువై ఎగిసిపడటంతో పక్కనే ఉన్న నాగిరెడ్డి రమణారెడ్డి పూరింటికి వ్యాపించి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు మంటలను అదుపు చేసి ఉదయగిరి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుస్తులు, ధాన్యం, నగదు, గృహోపకరణాలు కాలిపోవయాయి. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.