నెల్లూరు జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. జిల్లాలోని మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో... వెంకట సుబ్బారెడ్డి, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు (సురేష్, హేమంత్). పిల్లలకు సంక్రాంతి పండగకు కొత్త బట్టల కొనేందుకు తల్లిదండ్రులు పట్టణానికి వెళ్లారు. ఆడుకుంటామని చెప్పి ఇద్దరు చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లగా...గుంతలోపడి మృత్యువాత పడ్డారు. చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కుమారులు ఒకేసారి మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
'ఈత సరదా అన్నదమ్ముల ప్రాణం తీసింది' - two children dies at kommalapudi village news
ఈత సరదా ఆ చిన్నారుల ప్రాణాలు తీసింది. సంక్రాంతికి బట్టలు కొనేందుకు తల్లిదండ్రులు పట్టణానికి వెళ్లగా.. ఆడుకుంటామని చెప్పిన ఆ చిన్నారులు మృత్యువాతకు గురవడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. తమ బిడ్డలు ఇక లేరన్న విషయాన్ని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన విషాద ఘటన వివరాలివి..!

ఈతకు వెళ్లి అన్మదమ్ముల మృతి
TAGGED:
two children dies at nellore