Murder : ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైన ఘటనలు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కోటేశ్వరరావు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేశారు.
నెల్లూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని ఉడ్ హౌస్ సంఘం వద్ద రాత్రి మహేష్ అనే యువకుడిని కత్తులు, తల్వార్లతో దారుణంగా పొడిచి దుండగులు హతమార్చారు. మహేష్ స్నేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతుండగా ముసుగులు ధరించి వచ్చిన కొందరు దుండగులు విచక్షణా రహితంగా కత్తులు, తల్వార్లతో నరికి పరారయ్యారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఉన్న మహేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న రెండో నగర పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు మహేష్‌ను హతమార్చి పరారౌతుండగా స్థానిక సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డు అయ్యాయి. ఐతే మూడు రోజుల క్రితం తల్పగిరి కాలనీలో ఓ వ్యక్తిని గొంతు కోసి హతమార్చిన సంఘటన మరువక ముందే మరో హత్య జరగడంతో నగరవాసులు భయాందోళనకు గురౌతున్నారు.