నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 12 పూరిళ్లు దగ్ధమయ్యాయి. వాటిలో నివసించే గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గృహాలన్నీ దగ్గరగా ఉన్న కారణంగా.. వేగంగా మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్... 12 పూరిళ్లు దగ్ధం - దువ్వూరివారిపాలెంలో గ్యాస్ సిలిండర్ పేలి 12 పూరిళ్లు దగ్ధం
ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. పన్నెండు గిరిజన కుటుంబాలను రోడ్డున పడేసింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దువ్వూరివారిపాలెంలో ఈ ఘటన జరిగింది. చుట్టుపక్కల ఉన్న గృహాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు తేరుకునేలోపే 12 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

దువ్వూరివారిపాలెంలో గ్యాస్ సిలిండర్ పేలి పన్నెండు పూరిళ్లు దగ్ధం