ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇబ్బంది పెట్టకండి.. పసుపును కొనుగోలు చేయండి' - udayagiri turmeric farmers latest news

నాణ్యత గల పసుపుకొమ్ములు విక్రయానికి తెచ్చినా వ్యవసాయ మార్కెట్​ అధికారులు వెనక్కి తిరిగి పంపిస్తున్నారని ఉదయగిరి రైతులు ఆందోళన చేశారు. నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

ఉదయగిరిలో పసుపు రైతుల ఆందోళన
ఉదయగిరిలో పసుపు రైతుల ఆందోళన

By

Published : May 25, 2020, 5:09 PM IST

ఉదయగిరిలోని పసుపు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. యార్డుకు తెచ్చిన పసుపు కొమ్ములను తీసుకోకుండా.. నిబంధనల పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నాణ్యత గల కొమ్ములు విక్రయానికి తెచ్చినా... మార్క్​ఫెడ్, వ్యవసాయ మార్కెట్​ అధికారులు కొనుగోలు చేయకుండా వెనక్కు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పసుపులో తక్కువ పొడవు కలిగిన కొమ్ములు ఎక్కువగా ఉన్నాయని, తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. నాణ్యత గల పసుపుకొమ్ములు తెచ్చినా ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ వాపోయారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని తమను ఇబ్బంది పెట్టకుండా పసుపు కొనుగోలు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details