Tulasi Reddy: రాష్ట్రానికి మొదటి ద్రోహి భాజపా, రెండవ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రజలకు భాజపా పంగనామాలు పెట్టిందని మండిపడ్డారు. పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్‌కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Tulasi Reddy: పొత్తులపై పవన్‌కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదు: తులసిరెడ్డి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
Tulasi Reddy: పొత్తులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మొదటి ద్రోహి భాజపా అని, రెండవ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్‌కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదు
రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడకు ఉరి తాడు బిగించడమే అని ఆయన మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎత్తి వేసే విధంగా ఈ పథకం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేస్తే రైతుల ఆత్మహత్యలు అధికమవుతాయన్నారు.
ఇవీ చదవండి: Died: ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో విద్యార్థి మృతి