Mayor Sravathi met SP Tirumaleshwar Reddy: నిన్న నెల్లూరు కార్పోరేషన్ సమావేశంలో నగర మేయర్ స్రవంతికి అవమానం జరిగిందని. ముగ్గురు కార్పోరేటర్లు చీరపట్టుకుని లాగారని. ఎస్టీ మహిళాగా నన్ను అవమానపరిచారని.. ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయకుంటే జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకుపోతామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. రేపటి నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు పిలునిచ్చారు.
తీవ్ర స్థాయిలో గొడవ: నెల్లూరు కార్పోరేషన్ సమావేశంలో నిన్న పక్కా ప్రణాళిక ప్రకారం గొడవ సృష్టించారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వైపు చేరడంతో కార్పోరేషన్ లోని వైసీపీలో రెండు వర్గాలు మారారు. గత సమావేశంలోనే మేయర్ ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. నిన్న జరిగిన సమావేశంలో ప్రారంభంలోనే ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఎవరు పెట్టారని మేయర్ ప్రశ్నించినందుకు తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. మేయర్ వర్గానికి, మరో వర్గానికి మధ్య తీవ్ర స్దాయిలో వివాదం జరిగింది. నిన్న జరిగిన గొడవలో మేయర్ ని నెట్టడం జరిగింది. ఈ గొడవలో మేయర్ స్రవంతి చీర లాగారని , అవమాన పరిచారని ముగ్గురు కార్పోరేటర్లపై పోలీస్ కేసు పెట్టారు. నేడు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కేసు అంశమై కలిశారు. కార్పొరేటర్లు మొయిల్ల గౌరీ, మూలే విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ని అరెస్ట్ చేయాలని ఈ రోజు డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం ముందు ర్యాలీగా వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికితీసుకుపోతానని మేయర్ స్రవంతి చెప్పారు. గిరిజన సంఘాల నేతలు మద్దతు తెలిపారు.