రైళ్లలో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేస్తున్న వెంకటేశ్వర్లు అనే దొంగను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేశ్వర్లు చిత్తూరు జిల్లా చంద్రగిరివాసిగా గుర్తించారు. ఇతని వద్ద నుంచి 219 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. రైళ్లలో సమోసాలు అమ్ముకునే వెంకటేశ్వర్లు.. రాత్రిపూట గాఢ నిద్రలో ఉండే మహిళల ఆభరణాలు చోరీ చేస్తున్నట్లు నెల్లూరు రైల్వే డీఎస్పీ వసంత కుమార్ తెలిపారు. ఇతనిపై గతంలోనూ ఏడు చోరీ కేసులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పండగ సీజన్లలో రైళ్లలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
రైళ్లలో ఆభరణాల చోరీ.. దొంగను పట్టకున్న పోలీసులు - ఆభరణాల చోరీ దొంగను పట్టకున్న పోలీసులు
రైళ్లలో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేసే దొంగను నెల్లూరు రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి దోచుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆభరణాల చోరీ దొంగను పట్టకున్న పోలీసులు
ఆభరణాల చోరీ దొంగను పట్టకున్న పోలీసులు
ఇదీ చదవండి :