శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు పంచాయతీ రైతు భరోసా కేంద్రంలో ఎంపీవోలకు భూసార పరీక్షల పై శిక్షణ ఇచ్చారు. నెల్లూరు భూసార పరీక్షల కేంద్రం నుంచి అధికారిణులు చేరుకుని పరీక్షలు చేసే పద్ధతులు వివరించారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు చేసేలా వీరికి శిక్షణ ఇచ్చారు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గంలోని మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. భూసార పరీక్షలతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని నెల్లూరు భూసార పరీక్షల కేంద్రం అధికారిణులు పేర్కొన్నారు.
ఎంపీవోలకు భూసార పరీక్షల పై శిక్షణ - Training on ground tests for MPOs in nellore district
నెల్లూరు జిల్లాలోని రైతు భరోసా కేంద్రంలో ఎంపీవోలకు భూసార పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు చేసేలా వీరికి శిక్షణ ఇస్తున్నారు.

ఎంపీవోలకు భూసార పరీక్షల పై శిక్షణ