వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు నెల్లూరు నుంచి మరో ప్రత్యేక రైలు బీహార్‌కు బయలు దేరింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 1401 మంది వలస కార్మికులను 32 ఆర్టీసీ బస్సుల్లో నెల్లూరు రైల్వే స్టేషన్‌కు తరలించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల తర్వాతే కార్మికులను రైలులోకి అనుమతించారు.
జాయింట్ కలెక్టర్ కమల కుమారి తోపాటు పలువురు అధికారులు ఈ రైలును ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా నుంచి రెండు రైళ్లు బీహార్‌కు వెళ్లగా, మూడో రైలును ఇప్పుడు పంపించారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్తుండడంపై ఆనందించారు.