ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్​ తుపాను ప్రభావం.. సూళ్లూరుపేటలో నిలిచిన రాకపోకలు - సూళ్లూరుపేటలో వార్తలు

నివర్ తుపాను కారణంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. నీటిలో మునిగిన వరి పంటను అధికారులు పరిశీలించారు.

Traffic in Sullurupeta with Nivar cyclone at nellore district
నివర్​ తుఫాన్​తో సూళ్లూరుపేటలో నిలిచిన రాకపోకలు

By

Published : Nov 27, 2020, 3:17 PM IST

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నివర్ తుపానుతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోట - సూళ్లూరుపేట మార్గంలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు పారుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతూ ముందుకు సాగారు.

వర్షానికి నీటిలో మునిగిన వరి పంటను అధికారులు పరిశీలించారు. తడ మండలం కారిజాత గ్రామంలో చెరువుకు గండి పడే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పోలాల్లో వెళ్లి పరిశీలించారు. రైతులు చెరువు తెగకుండా ఇసుక బస్తాలు వేసి కాపాడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

కడపలో నివర్ తుఫాను తెచ్చిన కష్టాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details