నెల్లూరు జిల్లా నాయుడు పేటలోని స్వర్ణముఖి నది ఒడ్డున.. పర్యాటకులు సందడి చేస్తున్నారు. గాలి పటాలు ఎగరేస్తూ సాయంసంధ్య వేళ.. కాలక్షేపం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచీ ఇక్కడికి వస్తున్న ప్రకృతి ప్రేమికులు.. ప్రశాంతత పొందుతున్నారు. పర్యాటకుల సందడి పెరగిన కారణంగా.. పురపాలక సంఘం అధికారులు నదిలో బారికేడ్లు ఏర్పాటు చేయించారు. బ్రిడ్జ్ పై వీధి దీపాలు అమర్చారు. పార్కింగ్ వసతి కల్పించారు. పోలీసులు భద్రత పెంచారు.
స్వర్ణముఖి నది ఒడ్డున పర్యాటకుల సందడి - nellore district newsupdates
నాయుడుపేటలోని స్వర్ణముఖి నది.. పర్యాటక శోభ సంతరించుకుంది. కుటుంబ సమేతంగా వెళ్తున్న ప్రజలు.. కాసేపు సేదతీరుతున్నారు.
స్వర్ణముఖి నది తీరంలో పర్యాటకుల సందడి