ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం - డీసీ పల్లి పొగాకు కొనుగోలు కేంద్రం

నెల్లూరు జిల్లా డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అక్కడ సరైన ధర లభించడం లేదని ఇటీవల రైతులు ఆందోళన చేశారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరతో పొగాకు కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చింది.

tobacco purchases started in dcpalli tobacco centre by mark fed nellore district
డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం

By

Published : Jul 6, 2020, 1:18 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని ఇటీవల అక్కడ రైతులు నిరసన చేశారు. ఈ సమస్యను రైతు సంఘం నాయకులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి మార్క్ ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరతో పంట కొనాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నేడు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తమ సమస్య పట్ల స్పందించి వెంటనే నిర్ణయం తీసుకున్న సీఎంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details