నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, దుత్తలూరు తదితర మండలాల్లో విస్తారంగా పొగాగు సాగు చేస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రెండు వందల రూపాయలు పైనే ధర పలుకుతుందని ఆశించిన రైతులకు.. నిరాశే మిగిలిందని రైతు నాయకులు వాపోతున్నారు. ఈ ధరలతో రైతులకు గిట్టుబాటు కాదని, ధరలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
బెంగళూరు పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు 265 రూపాయలు ధర పలికిందని.. ఆ విధంగానే డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.