తెలుగుదేశం పార్టీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని... నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై నెల్లూరు జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే తెదేపా సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు... మాట్లాడలేని భాషలో పోస్టులు పెడుతున్న వైకాపాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుంటే... ప్రైవేట్ కేసు వేస్తామని స్పష్టం చేశారు.
'వైకాపా సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలి' - వైకాపా సోషల్ మీడియాపై చర్యలు
వైకాపా సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ లో టీఎన్ఎస్ఎఫ్ ఫిర్యాదు చేసింది. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుంటే.. ప్రైవేట్ కేసు వేస్తామని టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు తెలిపారు.
!['వైకాపా సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలి' tnsf](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7352807-141-7352807-1590486760083.jpg)
tnsf