తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టర్ చక్రధర్‌బాబుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు వీఆర్సీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ - ysrcp nominations in tirupathi by elections
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. నెల్లూరు వీఆర్ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ Tirupati Lok Sabha by-election ysrcp candidate Gurumurthy produced nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11199861-363-11199861-1616999671566.jpg)
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్
ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు.. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. నలుగురు మృతి