ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో గెలిపించండి.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతా: పనబాక లక్ష్మీ - somireddy comments

తిరుపతి ఉపఎన్నికకు అందరూ సమాయత్తం కావాలని... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూళ్లూరుపేటలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితులపై తెదేపా నేతలు, ఎన్నికల బరిలో ఉన్న పనబాక లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

panabaka lakshmi
తిరుపతి ఉపఎన్నికలో గెలిపించాలని కోరిన పనబాక లక్ష్మీ

By

Published : Mar 20, 2021, 11:11 PM IST

జనం కోసం జైలుకు వెళ్లేందుకు తాను వెనుకాడబోనని... తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్​లో రాజధాని ఏది అని అడిగితే.. ప్రజలు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయకు‌లు కార్యకర్తలు సమావేశంలో అధికార పార్టీ వైఫల్యాలను వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆథ్యాత్మిక కేంద్రాల్లో కొత్తకొత్త పద్ధతులు తెస్తోందని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 24న నెల్లూరులో నామినేషన్​కు అందరూ తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకోవడానికి తెదేపా తరఫున తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details