kidnap case:నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. 24 గంటల వ్యవధిలోనే కే చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్‌కు గురైన బాలికను రూ. 32వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ విజయారావు మీడియాకు తెలిపారు. ఆదివారం గంగపట్నం గ్రామంలోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో ఆడుకుంటున్న చిన్నారికి పండ్లు ఇస్తామని ఆశ చూపి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారు.
kidnap case: మూడేళ్ల బాలిక కిడ్నాప్...24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు - gangapatnam kidnap case
kidnap case: నెల్లూరు జిల్లాలో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. 24 గంటల వ్యవధిలోనే చిన్నారిని తల్లి దండ్రులకు అప్పగించారు.
పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు, ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుళ్లు ప్రమీల, శ్వేత లు బాలికను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద బాలిక లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చిన్నారిని విక్రయించిన విషయాన్ని కిడ్నాపర్లు బయటపెట్టారు. శ్రామిక నగర్ కు చెందిన జహీర్ అనే మహిళకు చిన్నారిని రూ. 32 వేలకు విక్రయించినట్లు తెలుసుకున్న పోలీసులు, అక్కడికి వెళ్లి బాలికను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ విజయరావు అభినందించారు.