ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి - accident in Nellore updates

Nellore district
Nellore district

By

Published : Mar 23, 2021, 6:57 AM IST

Updated : Mar 23, 2021, 11:10 AM IST

06:55 March 23

ఐదుగురు కూలీలు దుర్మరణం

కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి

నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి మృత్యువు దూసుకొచ్చి ఐదుగురిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. సంగం మండలం దువ్వూరు వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు- ముంబయి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొనడంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతిచెందిన వారిని దువ్వూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు(55), టి. రమణయ్య(60), కె. మాలకొండయ్య(50), జి. శీనయ్య(50), ఎం‌.శీనయ్యగా గుర్తించారు. 

కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ 14 మంది ఆటో ఎక్కబోతుండగా వెనకవైపు నుంచి వచ్చిన వ్యాను ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందటంతో పాటు వ్యాను డ్రైవరుతో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డి పాలెం సీఐ సురేష్‌ బాబు, సంగం ఎస్‌ఐ కె. శ్రీకాంత్‌ ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి:ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత !

Last Updated : Mar 23, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details